• రజియా బేగంను గెలిపించాలని నాయకుల అభ్యర్థన
న్యూస్ విశేషాలు కొండాపురం (నవంబర్ 22) : మండలంలోని కొమ్మి గ్రామంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రజియా బేగం, వార్డు సభ్యులకు మద్దతుగా సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గ్రామంలోని ఎస్సీ కాలనీ, కొత్తూరు ప్రాంతాల్లో నాయకులు ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చెరుకూరి వెంకటాద్రి నాయుడు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకున్న వ్యక్తి సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రజియా బేగంను, వార్డు సభ్యులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు గుమ్మ కుమారి, తెదేపా కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షుడు దేవినేని వెంకటసుబ్బయ్య, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, బూత్ ఇన్‌ఛార్జులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
