HomePoliticalనెల్లిపూడి సర్పంచ్ అభ్యర్థిగా ఎంబేటీ పోలయ్య ఖరార్

నెల్లిపూడి సర్పంచ్ అభ్యర్థిగా ఎంబేటీ పోలయ్య ఖరార్

• భారీ మెజారిటీతో గెలవాలని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ దిశానిర్దేశం

న్యూస్ విశేషాలు వాకాడు (నవంబర్ 24) : వాకాడు మండలం నెల్లిపూడి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిత్వంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.పంచాయతీ అభ్యర్థిగా ఎంబేటీ పోలయ్యను ఖరారు చేస్తూ గూడూరు ఎమ్మెల్యే డా. పాశిం సునీల్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా పోలయ్య మంగళవారం సుమారు 300 మంది గ్రామస్థులు, మద్దతుదారులతో కలిసి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.నెల్లిపూడి సర్పంచ్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని ఎంబేటీ పోలయ్య ఎమ్మెల్యేను కోరారు.దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్,నెల్లిపూడి పంచాయతీ అభ్యర్థిగా ఎంబేటీ పోలయ్య పేరును అధికారికంగా ప్రకటించారు. గ్రామంలో అందరినీ కలుపుకొని వెళ్తూ, రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఎమ్మెల్యే పోలయ్యకు దిశానిర్దేశం చేశారు. అందరూ ఐక్యంగా పనిచేసి పంచాయతీలో విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. పంచాయతీ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఎంబేటీ పోలయ్యను అభ్యర్థిగా ప్రకటించడంపై నెల్లిపూడి పంచాయతీ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.తమ ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments