HomeAndhra Pradeshశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

న్యూస్ విశేషాలు ప్రొద్దుటూరు (అక్టోబర్ 11) : ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రముఖ అమ్మవారిశాల దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి రాచమల్లు రమాదేవితో కలిసి కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దర్శించుకుని, అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందారు.అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు, మహిళా నాయకురాళ్లు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments