NEWS VISESHALU
ప్రింట్ తేదీ: నవంబర్ 29, 2026, 4:40 ఉదయం | ప్రచురణ తేదీ: నవంబర్ 27, 2026, 8:54 ఉదయం

గోంటువారిపల్లి సర్పంచ్‌గా కల్లూరి లింగమ్మ ఘన విజయం

గోంటువారిపల్లి సర్పంచ్‌గా కల్లూరి లింగమ్మ ఘన విజయం

• 83 ఓట్ల మెజారిటీతో విజయం

న్యూస్ విశేషాలు కాశీనాయన బద్వేల్ (నవంబర్ 26) : గోంటువారిపల్లి సర్పంచ్‌గా వైఎస్ఆర్సిపి పార్టీ మద్దతుదారులు కల్లూరి లింగమ్మ 83 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.తనపై నమ్మకంతో ఓట్లు వేసి, ఆదరించి, ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ విజయం గ్రామ ప్రజలందరి విజయమని, గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, గ్రామంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.గ్రామంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని, కులమతాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తూ గ్రామాభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు.నాపై నమ్మకం ఉంచిన గోంటువారిపల్లి గ్రామ ప్రజలందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.

సేవ్ చేసే ముందు రంగులు మార్చండి