NEWS VISESHALU
ప్రింట్ తేదీ: నవంబర్ 29, 2026, 4:41 ఉదయం | ప్రచురణ తేదీ: నవంబర్ 23, 2026, 1:37 మధ్యాహ్నం

కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించండి – పేట శివమ్మ

కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించండి – పేట శివమ్మ

న్యూస్ విశేషాలు కొండాపురం (నవంబర్ 22) : నెల్లూరు జిల్లా కొండాపురం మండలం శెట్టిపాలెం పంచాయతీ (తూర్పు జంగాలపల్లి) సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేట శివమ్మ ఓటర్లను ఆకట్టుకునేలా తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆమె పంచాయతీ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తనకు కేటాయించిన ఎన్నికల గుర్తు ‘కత్తెర’పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామ సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను ఎన్నికల బరిలోకి దిగినట్లు ఆమె పేర్కొన్నారు. నవంబర్ 26న ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న పోలింగ్‌లో ఓటర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.పంచాయతీ ప్రజలందరూ తనకు అండగా నిలిచి, కత్తెర గుర్తుపై ఓటు వేసి ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించాలని పేట శివమ్మ ఈ సందర్భంగా ప్రార్థించారు.

సేవ్ చేసే ముందు రంగులు మార్చండి