NEWS VISESHALU
ప్రింట్ తేదీ: అక్టోబర్ 14, 2026, 4:36 ఉదయం | ప్రచురణ తేదీ: అక్టోబర్ 13, 2026, 12:30 ఉదయం

*వ్యక్తిగత విమర్శలు మానుకోకపోతే తగిన గుణపాఠం తప్పదు – కొడవలూరు భక్తవత్సలరెడ్డి*

*వ్యక్తిగత విమర్శలు మానుకోకపోతే తగిన గుణపాఠం తప్పదు – కొడవలూరు భక్తవత్సలరెడ్డి*

• హామీల అమలుపై ప్రశ్నిస్తే వ్యక్తిత్వ హననానికి దిగుతారా?

• దమ్ముంటే వాకాడు మండలంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రండి

• వైకాపా పాలనలోనే రూ.100 కోట్లతో నిర్మాణాత్మక పనులు చేపట్టాం

న్యూస్ విశేషాలు వాకాడు (అక్టోబర్ 12) : ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలుపై నిలదీస్తే సమాధానం చెప్పలేక తెదేపా నాయకులు తనపై వ్యక్తిగత దూషణలు, దిగజారుడు విమర్శలకు పాల్పడుతున్నారని వైకాపా సీఈసీ సభ్యుడు, సీనియర్‌ నాయకుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వాకాడు మండల కేంద్రంలోని నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల వాకాడులో నిర్వహించిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డుల ప్రాధాన్యం, ప్రభుత్వ విధానాల వైఫల్యాలపై మాత్రమే తాను మాట్లాడానని స్పష్టం చేశారు. గూడూరు శాసనసభ్యుడు, వాకాడు మండల తెదేపా నాయకులు తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘తాను చోటా నాయకుడని, తన శారీరక రూపంపై అభ్యంతరకరంగా మాట్లాడటం కూటమి నాయకుల సంస్కారహీనతకు నిదర్శనమని, తాను 40 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న నిబద్ధత కలిగిన సామాన్య కార్యకర్తనని, రాజ్యాంగం కల్పించిన హక్కుతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రినైనా ప్రశ్నించే అధికారం నాకుందని, 2014 రుణమాఫీ మొదలుకొని ప్రస్తుత సూపర్‌ సిక్స్ హామీలైన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, కొత్త పింఛన్ల మంజూరుపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము తెదేపా నాయకులకు ఉందా?’ అని ఆయన నిలదీశారు.స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ రవాణా, భూ ఆక్రమణలపై తనపై నిరాధార ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ‘తాను ఎక్కడా ఇసుక అమ్మలేదు, భూములు ఆక్రమించలేదని, గ్రామంలో పాఠశాల నిర్మాణానికి, తారు రోడ్డుకు, ఆర్బీకే కేంద్రానికి తన సొంత భూమినే ప్రభుత్వానికి ఉచితంగా రాసిచ్చాడని, తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే పాండురంగేశ్వర స్వామి లేదా కాణిపాకం ఆలయంలో ప్రమాణానికైనా సిద్ధం’ అని సవాల్ విసిరారు. సామాన్యులపై, జడ్పీటీసీ సభ్యులపై కూటమి నాయకులు అక్రమ కేసులు బనాయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.గత వైకాపా ప్రభుత్వ హయాంలో వాకాడు ఏరియా ఆసుపత్రి, బాలిరెడ్డిపాళెం పీహెచ్‌సీ, నాడు-నేడు కింద పాఠశాలల ఆధునికీకరణ, డబుల్ రోడ్లు, జలజీవన్ మిషన్ తదితర పనుల కోసం దాదాపు రూ.100 కోట్ల మేర నిధులు వెచ్చించి అభివృద్ధి చేశామని వివరించారు.నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో స్వర్ణముఖి బ్యారేజ్, తీరప్రాంత రక్షణ గోడలు, ఫ్లడ్ బ్యాంక్స్, రోడ్లు నిర్మించి మండల రూపురేఖలు మార్చామని గుర్తుచేశారు. వాకాడు మండలంలో ఎవరు నిజమైన అభివృద్ధి చేశారో నిరూపించేందుకు పాత్రికేయుల సమక్షంలో నిష్పాక్షిక బహిరంగ చర్చకు రావాలని తెదేపా నేతలకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.ఇప్పటికైనా వ్యక్తిగత దూషణలు మాని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అయన హెచ్చరించారు.*నేదురుమల్లి విద్యాసంస్థలపై దుష్ప్రచారం తగదు – జడ్పీటీసీ రౌతు రామకృష్ణ* పేదలకు అండగా నిలుస్తూ వేలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన నేదురుమల్లి విద్యాసంస్థలపై అసత్య ప్రచారాలు చేయడం తగదని జడ్పీటీసీ రౌతు రామకృష్ణ మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 1935లోనే నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడుతూ ‘హరిజన విద్యార్థి ఉద్ధారక సంఘం’ ఏర్పాటు చేసి ఎస్సీలకు విద్యాబుద్ధులు నేర్పారని గుర్తుచేశారు. ఎన్బీకేఆర్ సంస్థలు సేవా దృక్పథంతో ఏర్పాటయ్యాయని, వాటిపై కొందరు తప్పుడు ప్రచారం చేయడం విచారకరమన్నారు. ఆధారాలు ఉంటే రికార్డులు పరిశీలించి మాట్లాడాలన్నారు.వైఎస్సార్‌సీపీ శ్రేణులపై స్థానిక కూటమి నాయకుల ఒత్తిళ్లతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి పేదల ఇళ్ల కోసం 14 ఎకరాల భూమిని ఇచ్చారని, ఆయన పేరును నియోజకవర్గంలో సముచిత రీతిలో గౌరవించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తలకు న్యాయపరంగా అండగా నిలుస్తామని, ఎలాంటి కక్షసాధింపు చర్యలకైనా భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సేవ్ చేసే ముందు రంగులు మార్చండి